Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
  • 25, 26 తేదీల్లో అతి భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరిక
  • రెండు రోజులు ‘ఆరెంజ్‌’ అలర్ట్ జారీ
three days of heavy rains in telangana

తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రెండు రోజులు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.


దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రా దగ్గరలోని వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో 24న ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

More Telugu News