Telangana: 13 నెలల తర్వాత రాజ్‌ భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్

  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే 
    ప్రమాణ స్వీకారానికి హాజరు
  • జస్టిస్ అలోక్‌ అరాధేతో ప్రమాణం చేయించిన 
    గవర్నర్ తమిళిసై
  • గవర్నర్ తో వేదిక పంచుకున్న సీఎం కేసీఆర్
CM KCR participates in the swearing in ceremony of CJ Alok Aradhe in Rajbhavan

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే  ఈ ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో 11 గంటలకు జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ అలోక్ అరాధే ఆరో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. 

కాగా, సీఎం కేసీఆర్  దాదాపు 13 నెలల విరామం తర్వాత మళ్లీ రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. గతేడాది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్‌ భవన్‌ కు వచ్చి గవర్నర్‌‌ తమిళిసైతో వేదిక పంచుకున్నారు. సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు కూడా చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చారు.

More Telugu News