Sunny Leone: మా అమ్మ తాగుడుతో చాలా ఇబ్బందులు పడ్డాం: సన్నీ లియోన్

Sunny Leone admits her adult entertainment career triggered mothers alcoholism
  • బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సంచలన ఇంటర్వ్యూ
  • తన తల్లి మద్యం అలవాటుపై పలు విషయాలు వెల్లడి
  • తాను పోర్న్ ఇండస్ట్రీలోకి కాలుపెట్టకముందే తల్లికి మద్యం తాగే అలవాటు ఉందన్న నటి
  • తాను నీలి చిత్రాల్లో నటిస్తుండటం చూసి తల్లికి మద్యం వ్యసనంగా మారి ఉండొచ్చని వ్యాఖ్య

పోర్న్ నటిగా ఎదుర్కొన్న వివక్షను అధిగమించి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో సక్సెస్ సాధించిన నటి సన్నీ లియోనీ. తన కెరీర్ గురించి ఆమె తాజాగా పలు విషయాలను పంచుకున్నారు. అమెరికాలో ఉండగా పోర్న్ చిత్రాల్లో నటించడం, తన తల్లి మద్యం అలవాటు తదితర విషయాల గురించి పేర్కొన్నారు. తన నీలి చిత్రాల కెరీర్‌ కూడా తల్లి మద్యానికి బానిసయ్యేందుకు ఓ కారణం అయ్యి ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు. 

‘‘ఆమ్మకు అప్పటికే మద్యం తాగే అలవాటు ఉంది. కానీ నేను పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడమే నా తల్లి మద్యానికి బానిసయ్యేందుకు కొంత మేరకు కారణమని చెప్పక తప్పదు.  దీని వల్ల మా ఇంట్లో నానా రచ్చ జరగుతుండేది. నా కంటే కూడా మా అమ్మకు మందే ఇష్టమని అనికునేదాన్ని. కానీ అసలు విషయం అది కాదని తరువాత అర్థమైంది. ఇది ఓ మానసికమైన సమస్య. దీనికి నేను, నా సోదరుడు లేదా మా నాన్న బాధ్యులు కాము’’ అని ఆమె చెప్పుకొచ్చింది. డేనియల్ వెబర్‌ను పెళ్లి చేసుకున్న సన్నీ ప్రస్తుతం ఇండియాలో ఉంటున్న విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు పిల్లలు కాగా, మరో చిన్నారిని దత్తత తీసుకుంది.

  • Loading...

More Telugu News