Venkateswara Swamy: తిరుమల వెంకన్న ఆస్తుల వివరాలు ఇవిగో!

  • వారణాసిలో అంతర్జాతీయ ఆలయాల సమావేశం
  • హాజరైన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
  • శ్రీవారి పేరిట రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు
  • బ్యాంకులో 11 టన్నుల బంగారం
  • టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీప్రాంతం
Tirumala Venkateswara Swamy assets details

కలియుగ దైవంగా తిరుమల వెంకటేశ్వరస్వామికి పేరుంది. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే వెంకన్నస్వామి అత్యంత సంపన్నుడు అని తెలిసిందే. హుండీ రూపేణా ఆయనకు నిత్యం కోట్లలో ఆదాయం లభిస్తుంది. కాగా, స్వామివారికి ఎంతటి ఆస్తి ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తాజాగా వెల్లడించింది. వారణాసిలో జరిగిన అంతర్జాతీయ ధార్మిక సమావేశంలో పాల్గొన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి ఆస్తులు, ఇతర నిర్వహణ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంచుకున్నారు.

ఈవో ధర్మారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం....

  • తిరుమల వెంకటేశ్వరస్వామి వారి పేరిట బ్యాంకులో రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి.
  • బ్యాంకులో 11 టన్నుల బంగారం డిపాజిట్లు ఉన్నాయి.
  • శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాల బరువు 1.2 టన్నులు.
  • వెండి ఆభరణాల బరువు 10 టన్నులు.
  • టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. 
  • టీటీడీలో 24,500 మంది ఉద్యోగులు ఉన్నారు.
  • శ్రీవారి సన్నిధిలో భక్తులకు సేవలు అందించే ఉద్యోగుల సంఖ్య 800.
  • స్వామివారికి ప్రతి ఏడాది 500 టన్నుల పుష్పాలతో అలంకరణ.
  • ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం ప్రతి సంవత్సరం 500 టన్నుల నెయ్యి వినియోగం.
  • టీటీడీ కింద దేశవ్యాప్తంగా 71 ఆలయాలు.

More Telugu News