Ravi Ruia: లండన్ లో కళ్లు చెదిరే ధరకు భవంతిని కొనుగోలు చేసిన భారత బిలియనీర్

  • హానోవర్ లాడ్జ్ మాన్షన్ ను కొనుగోలు చేసిన రవి రుయా
  • మాన్షన్ విలువ రూ.1,200 కోట్లు
  • లండన్ లో భారీ గృహ కొనుగోళ్లలో ఒకటిగా నిలిచిన డీల్ 
Indian billionaire Ravi Ruia buys a mansion in London for Rs 1200 cr price

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ భారతీయుల ముద్ర సుస్పష్టం. తాజాగా, బ్రిటన్ లోని లండన్ మహానగరంలో ఓ భవంతిని కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేయడం ద్వారా భారత కుబేరుడు రవి రుయా అందరి దృష్టిని ఆకర్షించారు. 

రష్యా స్థిరాస్తి పెట్టుబడుల వ్యాపారి ఆండ్రీ గోంచారెంకోకు చెందిన ఓ భారీ భవంతిని రవి రుయా రూ.1,200 కోట్లకు కొనుగోలు చేశారు. గత కొన్నేళ్ల కాలంలో యూకే రాజధానిలో జరిగిన భారీ గృహ కొనుగోళ్లలో ఇదొకటిగా నిలిచింది. 

పెట్టుబడుల సంస్థ ఎస్సార్ గ్రూప్ కు రవి రుయా సహ యజమానిగా ఉన్నారు. తమ కుటుంబం తరఫున తాజా భవంతిని ఆయన కొన్నారు. ఈ భవనం పేరు హానోవర్ లాడ్జ్ మాన్షన్. లండన్ లోని ఖరీదైన ప్రాంతం రీజెంట్స్ పార్క్ ఏరియాలో ఉంది. 

కాగా ఈ భవనానికి గతంలో బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ మద్దతుదారుడు రాజ్ కుమార్ బాగ్రి యజమానిగా ఉన్నారు. ఇది చేతులు మారుతూ చివరికి రవి రుయా చేతికి వచ్చింది. నిర్మాణంలో ఉన్న ఈ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.

More Telugu News