manipur: మణిపూర్ ఫైల్స్ పేరుతో సినిమా తీయాలి: సామ్నా పత్రికలో శివసేన

Movie named Manipur Files should be made Sena
  • కశ్మీర్ కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయని విమర్శ
  • సుప్రీం జోక్యం లేకపోతే మోదీ నోరు మెదపకపోయేవారని ఆగ్రహం
  • బీజేపీయేతర ప్రభుత్వం ఉండి ఉంటే రద్దు చేసేవారని విమర్శ
మణిపూర్ హింసాత్మక ఘటనలపై మణిపూర్ ఫైల్స్ పేరుతో సినిమా తీయాలని చురకంటిస్తూ ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ).. కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగింది. కశ్మీర్ లో కంటే మణిపూర్ లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోకపోయి ఉంటే, ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదిపేవారు కాదని ఆ పార్టీ పత్రిక సామ్నాలో శివసేన మండిపడింది.

తాష్కేంట్ ఫైల్స్, ది కశ్మీర్‌ ఫైల్స్‌, ది కేరళ స్టోరీ పేరుతో సినిమాలు తీశారని, ఇప్పుడు వారు మణిపూర్‌ ఫైల్స్ పేరుతో సినిమా తీయాలని పేర్కొంది. మణిపూర్‌లో కనుక బీజేపీయేత ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేవారని విమర్శించింది. రాజకీయపరంగా ప్రధాని మోదీకి మణిపూర్‌తో పెద్దగా ప్రయోజనం లేదని, అందుకే అక్కడి ఘర్షణలను ఆయన పట్టించుకోలేదని సామ్నా ఆరోపణలు గుప్పించింది.
manipur
Jammu And Kashmir
BJP
Shiv Sena

More Telugu News