buddha venkanna: షర్మిలకు జగన్, అవినాశ్ రెడ్డిల నుండి ప్రాణహాని: టీడీపీ నేత బుద్దా వెంకన్న

Life threat to Sharmila from YS Jagan and Avinash Reddy says Budha venkanna
  • షర్మిలకు వై కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రానికి వెంకన్న విజ్ఞప్తి
  • షర్మిల దర్యాఫ్తు సంస్థల ముందు చెప్పినవన్నీ వాస్తవాలని వ్యాఖ్య   
  • వివేకా హత్యతో కుటుంబం ఎంత నష్టపోయిందో.. జగన్ వల్ల రాష్ట్రం అంతే నష్టపోయిందన్న వెంకన్న 
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిల నుండి ప్రాణహాని ఉందని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యం చెప్పిన షర్మిలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో షర్మిల దర్యాఫ్తు సంస్థల ముందు చెప్పినవన్నీ వాస్తవాలే అన్నారు. వైఎస్ వివేకా హత్య వల్ల ఆ కుటుంబం ఎంతగా నష్టపోయిందో, జగన్ కారణంగా రాష్ట్రం కూడా అంతే నష్టపోయిందన్నారు.
buddha venkanna
Telugudesam
YS Jagan
YS Avinash Reddy

More Telugu News