Varudu Kalyani: టీడీపీ సైకో పార్టీ.. అనిత భాష మహిళలు తలదించుకునేలా ఉంది: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

Women are feeling ashamed of Anitha language says Varudu Kalyani
  • టీడీపీ అంటే తెలుగు డర్టీ పార్టీ అన్న కల్యాణి 
  • మహిళలను మోసం చేసిన పార్టీ టీడీపీ అని మండిపాటు
  • ఏపీలో పేదరికం 5.1 శాతం తగ్గిందని సర్వేలు చెపుతున్నాయని వ్యాఖ్య
టీడీపీ అంటే తెలుగు డర్టీ పార్టీ అని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో పేదరికం 5.1 శాతం తగ్గిందని సర్వేలు చెపుతున్నాయని, ఇదంతా జగన్ సంక్షేమ పథకాలతోనే సాధ్యమయిందని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత జగన్ దని అన్నారు. 

మహిళలను మోసం చేసిన పార్టీ టీడీపీ అని కల్యాణి విమర్శించారు. ఆ పార్టీకి మహిళా అధ్యక్షురాలు అనిత అని, మహిళా లోకం తలదించుకునేలా అనిత మాట్లాడుతోందని మండిపడ్డారు. అనిత ఉపయోగిస్తున్న భాషను ఆమె పిల్లలు కూడా హర్షించరని అన్నారు. మహిళల పేరెత్తే అర్హత కూడా టీడీపీకి లేదని చెప్పారు. మహిళలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీ ఒక సైకో పార్టీ అని అన్నారు. మహిళలకు మంచి చేస్తున్నది వైసీపీనే అని చెప్పారు.
Varudu Kalyani
YSRCP
Jagan
Chandrababu
Anitha
Telugudesam

More Telugu News