Nirmala: నా భర్త అలా చనిపోతాడని ఊహించలేదు: నటుడు నెల్లూరు కాంతారావు భార్య నిర్మల

Nirmala Interview
  • వస్తాదుగా నెల్లూరి కాంతారావుకి మంచి పేరు
  • ఆర్ధికంగా బలమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి  
  • ఎన్టీఆర్ ప్రోత్సాహంతో 40కి పైగా సినిమాలను చేసిన నటుడు
  • ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారన్న భార్య

1960లలో నటుడిగా .. వస్తాదుగా నెల్లూరు కాంతారావుకి మంచి పేరు ఉండేది. వస్తాదుగానే ఆయన పలు పౌరాణికాల్లో .. సాంఘికాల్లో కనిపించారు. ఆయన భార్య నిర్మల వయసు ఇప్పుడు 80కి పైనే. తాజాగా ఒక యూ ట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన భర్తను గురించిన అనేక విషయాలను ఆమె ప్రస్తావించారు. 

"మా వారు వాళ్లది ఉమ్మడికుటుంబం .. నలుగురు అక్కా చెల్లెళ్లు .. ఐదుగురు అన్నదమ్ములు .. ఇది ఆయన కుటుంబం. ఆ ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. ఎవరికీ కూడా చెడు అలవాట్లు ఉండేవి కాదు. పొలాలు .. మిల్లులు .. ఇతర వ్యాపారాలు ఉండేవి. ఆర్ధికంగా బలమైన కుటుంబమే. మాకు 'కనక మహల్' అని ఒక సినిమా థియేటర్ ఉండేది. ఆయన దాని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటూ, వ్యాయామశాలను నడిపేవారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో 40కి పైగా సినిమాలలో నటించారు.

మాకు సంతానం లేకపోవడంతో .. అందుకు సంబంధించిన ఒక చిన్న ఆపరేషన్ ను ఆయన చేయించుకోవాలనుకున్నారు. ఆ సమయంలో నేను హాస్పిటల్ బయటనే ఉన్నాను. అయితే అనుభవం లేనివారు మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వలన, ఆయన చనిపోయారు. ఇద్దరం కలిసి హాస్పిటల్ కి వెళ్లి, మళ్లీ ఆయన శవంతో బయటికి వస్తానని నేను ఎంత మాత్రం ఊహించలేదు" అంటూ ఆమె చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News