kachidi fish: మత్స్యకారులకు చిక్కిన ‘కచిడి’ చేప.. వేలంలో కళ్లు చెదిరే ధర!

  • కాకినాడ కుంభాభిషేకం రేవులో చిక్కిన అరుదైన చేప
  • 25 కిలోల బరువున్న చేపకు రూ.3.30 లక్షల ధర
  • ఎన్నో మందుల తయారీలో ఈ చేపను వాడుతారన్న అధికారులు
east godavari kachidi fish caught by fishermen kakinada

మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప.. వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది. అనేక వ్యాధులను నయం చేసేందుకు తయారుచేసే ఔషధాల్లో ఉపయోగించే ‘కచిడి’ చేప.. కాకినాడ కుంభాభిషేకం రేవులో మత్స్యకారుల వలకి చిక్కింది.

వెంటనే ఈ చేపను వేలం వేయగా.. దాదాపు రూ.3.30 లక్షలు పలికింది. ఈ కచిడి చేప బరువు 25 కిలోల దాకా ఉంది. ఇక వేలం వేయడంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి రూ.20 వేలు కమిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మత్స్యకారుల చేతికి రూ.3.10 లక్షలు వచ్చినట్లు సమాచారం.

కచిడి చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలో ఈ చేపను ఎక్కువగా ఉపయోగిస్తుంటారని పేర్కొంటున్నారు. అందుకే ఈ చేపకు రూ.లక్షల్లో డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.

More Telugu News