Hyderabad: భారీ వర్షాలకు హైదరాబాద్​ జంట జలాశయాల పరిస్థితి ఇదీ..!

  • పూర్తిగా నిండిన హిమాయత్ సాగర్
  • నాలుగు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
  • గరిష్ఠ నీటి మట్టానికి చేరుకుంటున్న ఉస్మాన్ సాగర్
water from Himayathsagar reservoir is released into downstream

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌‌ లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తిగా నిండిపోయింది. నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు మొత్తం ఆరు గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. హిమాయత్ సాగర్ గరిష్ఠ నీటి మట్టం (ఎఫ్టీఎల్) 1763.50 అడుగులు, నిల్వ సామర్థ్యం 2.970 టీఎంసీలు కాగా పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్టులోకి మూడు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. 

మధ్యాహ్నం 12 గంటలకు నాలుగు గేట్లను 2 అడుగుల మేర తెరిచి దిగువకు 2,750 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు. ఒంటి గంటకు మరో రెండు గేట్లు ఎత్తారు. మరోవైపు ఉస్మాన్ సాగర్ గరిష్ఠ నీటి మట్టం (ఎఫ్టీఎల్) 1790 అడుగులు, నిల్వ సామర్థ్యం 3.900 టీఎంసీలు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు నీరు 1785.70 అడుగులకు చేరుకుంది. 2.954 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉన్నా ప్రస్తుతానికి ఔట్ ఫ్లో లేదు. అన్ని గేట్లు మూసి ఉంచారు. రిజర్వాయర్ నిండితే దీని నుంచి కూడా నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది.

More Telugu News