Siddaramaiah: అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ హాజరు కాకపోవడానికి కారణం ఇదే: సిద్ధరామయ్య

  • రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరించిందన్న సిద్ధరామయ్య
  • జాతీయ స్థాయి ప్రముఖులు వచ్చినప్పుడు స్టేట్ గెస్ట్ గౌరవాన్ని ఇవ్వడం సాధారణమే అన్న సీఎం
  • బీజేపీతో జేడీఎస్ ఎందుకు చేయి కలిపిందో అని ఎద్దేవా
Siddaramaiah fires on BJP

అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరించడాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తప్పుపట్టారు. శాసనసభలో ప్రతిపక్షాలది కీలక పాత్ర అని... ప్రభుత్వం చేసే తప్పులను లేవనెత్తాల్సింది ప్రతిపక్షమేనని... దీన్ని పక్కనపెట్టి రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరించిందని విమర్శించారు. జాతీయ స్థాయి ప్రముఖులు బెంగళూరుకు వచ్చినప్పుడు స్టేట్ గెస్ట్ గా ఐఏఎస్ అధికారులను నియమించామని... ఇందులో ఏం తప్పుందని బీజేపీ వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. 

2019లో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ జరిగిందని... స్టేట్ గెస్ట్ గౌరవం ఇవ్వాలని అప్పటి కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కోరారని చెప్పారు. 2018లో సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసినప్పుడు దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చారని, అప్పుడు కూడా స్టేట్ గెస్ట్ సంప్రదాయాన్ని కొనసాగించారని తెలిపారు. ప్రతిపక్ష నేతలను ఎంపిక చేయడంలో బీజేపీ విఫలమయిందని... ఈ క్రమంలో వారిని తాము ప్రశ్నిస్తామనే ఒక పథకం ప్రకారం వారు సభకు గైర్హాజరయ్యారని సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. బీజేపీతో జేడీఎస్ ఎందుకు చేతులు కలిపిందో అని ఎద్దేవా చేశారు. 

More Telugu News