శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల.. ఎప్పుడంటే..!
- శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఈ నెల 24న రిలీజ్
- ఆగస్టు, సెప్టెంబర్ నెలల టికెట్లు ఈ నెల 25న విడుదల
- అదనపు కోటా కింద నాలుగు వేల టికెట్లు
- ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
మరోవైపు, శనివారం (22వ తేదీ) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ప్రస్తుతం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయని, కంపార్ట్మెంట్ల బయట కూడా భక్తులు క్యూ కట్టారని వివరించారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.