Samantha: మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ లో నెంబర్ వన్ గా సమంత

Samantha topped Most Popular Female Stars in India
  • ఫిమేల్స్ స్టార్స్ టాప్-10 జాబితా విడుదల చేసిన ఓర్మాక్స్ మీడియా 
  • అలియా భట్, దీపిక పదుకొణే, నయనతారలను వెనక్కి నెట్టిన సమంత
  • అనారోగ్యంతో బాధపడుతున్నా కెరీర్ ను ముందుకు తీసుకెళుతున్న సామ్
ప్రముఖ నటి సమంత ఖాతాలో మరో ఘనత చేరింది. ఈ దక్షిణాది బ్యూటీ జాతీయస్థాయిలో మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్-2023 జాబితాలో నెంబర్ వన్ గా నిలిచింది. ఓర్మాక్స్ మీడియా సంస్థ ఈ జాబితా రూపొందించింది. 

ఇందులో అలియా భట్, దీపిక పదుకొణే వంటి బాలీవుడ్ భామలను, నయనతార వంటి దక్షిణాది లేడీ సూపర్ స్టార్ ను కూడా వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానాన్ని అందుకోవడం విశేషం. 

ఓర్మాక్స్ మీడియా సంస్థ ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ పేరిట ఈ జాబితా రూపొందించింది. టాప్-10లో నిలిచిన వారి వివరాలను ఓర్మాక్స్ మీడియా సోషల్ మీడియాలో పంచుకుంది.

1. సమంత రూత్ ప్రభు
2. అలియా భట్
3. దీపిక పదుకొణే 
4. నయనతార
5. కాజల్ అగర్వాల్
6. త్రిష
7. కత్రీనా కైఫ్
8. కియారా అద్వానీ
9. కీర్తి సురేశ్
10. రష్మిక మందన్న

సమంత ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లో పాన్ ఇండియా లెవల్లో పవర్ పెర్ఫార్మర్ గా నిలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న సామ్... యశోద, శాకుంతలం వంటి చిత్రాలతో నటిగా మరికొన్ని మెట్లు పైకెక్కింది. 

అనారోగ్యం సైతం సమంత దృఢ సంకల్పం ముందు ఓడిపోయింది. చికిత్స పొందుతూనే ఆమె సినిమాలు పూర్తి చేస్తూ కెరీర్ లో అత్యంత కఠినమైన దశను అధిగమించేందుకు శక్తిమేర ప్రయత్నిస్తోంది. 

ప్రస్తుతం సమంత... విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తోంది. అటు, ప్రపంచవ్యాప్తంగా పాప్యులరైన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లోనూ నటిస్తోంది.
Samantha
Most Popular Female Stars
Ormax Media
India

More Telugu News