BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ఫొటోలు ఇవిగో

Kishan Reddy takes charge as BJP Telangana president
  • కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్, ఈటల, రఘునందన్ రావు తదితరులు
  • అంతకు ముందు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి
  • బషీర్ బాగ్ లో కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల ప్రభాకర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అంతకు ముందు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కార్యకర్త ఇచ్చిన ఖడ్గాన్ని ఆయన ఎత్తి చూపారు. అక్కడి నుంచి బషీర్ బాగ్ లోని కనకదుర్గ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు.
BJP
Telangana
Kishan Reddy

More Telugu News