KCR: మహారాష్ట్ర నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న కేసీఆర్?

KCR thinking of contesting from Maharashtra
  • జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న కేసీఆర్
  • నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం
  • మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తే జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతమవుతుందని కేసీఆర్ భావన
వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తెలంగాణను దాటి మహారాష్ట్రలో కేసీఆర్ దూకుడు పెంచారు. మహారాష్ట్రలో ఇప్పటికే పలు భారీ బహిరంగసభలను నిర్వహించారు. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఇంకోవైపు పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని చెపుతున్నారు. నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం. మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తే జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతమవుతుందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
KCR
BRS
Maharashtra

More Telugu News