Sri Vishnu: 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'సామజవరగమన'

  • జూన్ 29న వచ్చిన 'సామజవరగమన'
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో దక్కిన హిట్ 
  • శ్రీవిష్ణుకి అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టిన సినిమా ఇదే
  • ఈ నెల 28వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ 
Samajavaragamana movie OTT release date confirmed

శ్రీవిష్ణు కథానాయకుడిగా 'సామజవరగమన'సినిమా తెరకెక్కింది. రాజేశ్ దండా నిర్మాణంలో .. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. రెబా మోనిక జాన్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. జూన్ 29వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. మొదటి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీవిష్ణు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. 

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా'వారు దక్కించుకున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా పోస్టర్ ను వదిలారు. ప్రేమ - పెళ్లి అనే రెండు అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఫస్టాఫ్ అంతా ప్రేమకి సంబంధించిన కామెడీ .. సెకండాఫ్ అంతా పెళ్లికి సంబంధించిన కామెడీ నడుస్తుంది. 

ఫస్టాఫ్ లో నరేశ్ .. సెకండాఫ్ లో వెన్నెల కిశోర్ కామెడీ పరంగా ఈ సినిమాను ఆదుకున్నారు. ఈ ఇద్దరి మధ్య హీరో - హీరోయిన్స్ కి సంబంధించిన లవ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేసిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి కూడా ఎక్కువ ఓట్లు కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

More Telugu News