government: ఇకపై స్ట్రీట్ ఫుడ్ కూ నాణ్యతా నిబంధనల వర్తింపు?

  • ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లలోనే నాణ్యతా నిబంధనలు
  • నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్న అధికారులు
  • వీధి వ్యాపారులకూ వర్తింపజేయాలని భావిస్తున్న కేంద్రం
Quality norms to food items sold on streets soon

హోటళ్లు, రెస్టారెంట్లలో లభించే ఆహార పదార్థాలకు నాణ్యతా ప్రమాణాలు ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిల్లో తనిఖీ చేస్తుంటారు. నిర్ణీత ప్రమణాలను పాటించని వ్యాపారులకు జరిమానా విధిస్తుంటారు. కస్టమర్లు ఫిర్యాదు చేస్తే కూడా చర్యలు తీసుకుంటారు. అయితే, రోడ్డు పక్కన లభించే తినుబండారాలు, ఆహార పదార్థాలకు మాత్రం ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు, రూల్స్ ఉండవు. అక్కడ కొనుగోలు చేసే ఆహారం బాగాలేకపోయినా ఏమీ చేయలేరు. 

అయితే, ఇకపై వీధి వ్యాపారులూ నాణ్యతా ప్రమాణాలు పాటించనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల మాదిరిగా వారిపైనా ఫిర్యాదు చేయవచ్చు. నాణ్యాతా ప్రమాణాల నిబంధల పరిధిలోకి వీధి వ్యాపారులను కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ విషయంలో విదేశాల్లో ఎలాంటి నిబంధలు ఉన్నాయో తెలుసుకుంటామని చెప్పారు.

More Telugu News