వారానికి రెండు రోజుల వ్యాయామంతోనూ గుండెపోటు దూరం!
- 90 వేల మందిపై జరిపిన అధ్యయనంలో వెల్లడి
- వారంలో రెండు రోజులు తీవ్రస్థాయిలో వ్యాయామంతోనూ హృద్రోగ సమస్యలు దూరం
- వారమంతా సాధారణ స్థాయి వ్యాయామం, రెండు రోజుల తీవ్రస్థాయి వ్యాయామంతో సమానమంటున్న నిపుణులు
వారమంతా సాధారణ వ్యాయామాన్ని కొనసాగించాలా? లేదంటే వారంలో రెండు, మూడు రోజులు చేయడం ద్వారా పూర్తిస్థాయి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చా? అనే విషయాన్ని తేల్చేందుకు 2013-2015 మధ్య బ్రిటన్ శాస్త్రవేత్తలు 62 ఏళ్ల సగటు వయసున్న దాదాపు 90 వేల మందిపై అధ్యయనం నిర్వహించారు. వారమంతా వ్యాయామం చేసినా, వారంలో ఒకటి రెండు రోజులు తీవ్రస్థాయిలో కసరత్తులు చేసినా ఆరోగ్యంపై దాని ప్రభావం సమాన స్థాయిలోనే ఉన్నట్టు గుర్తించారు. గుండెపోటు, పక్షవాతం, ఎట్రియల్ ఫైబ్రిలేషన్, మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ వంటి హృదయ సంబంధిత సమస్యల ముప్పు ఒకేలా తగ్గుతుందని గుర్తించారు.