maheshwar reddy: బీజేపీలో చేరేందుకు ఇంద్రకరణ్ ప్రయత్నాలు చేస్తున్నారు: మహేశ్వర్ రెడ్డి

Maheshwar Reddy shocking comments on Indrakaran
  • ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని వెల్లడి
  • ఇంద్రకరణ్ బీజేపీలో చేరితే ముథోల్ టిక్కెట్ ఇప్పిస్తానన్న మహేశ్వరరెడ్డి
  • ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోవడానికి దారులు వెతుక్కుంటున్నారని వ్యాఖ్య
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంద్రకరణ్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయన కమలం పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేసినట్లుగా తన వద్ద ఆధారాలున్నాయన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అతని స్నేహితుడు కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారన్నారు.

ఇందుకు సంబంధించి తన వద్ద రుజువులు ఉన్నాయని, ఇంద్రకరణ్ కనుక బీజేపీలో చేరితే ముథోల్ టిక్కెట్ ఇప్పిస్తామని వ్యాఖ్యానించారు. అంతేకానీ, అనవసరంగా ఇతరులపై విమర్శలు సరికాదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఓటమి ఖాయమని, దీని నుండి తప్పించుకోవడానికి ఆయన దారులు వెతుకుతున్నారన్నారు.
maheshwar reddy
Indrakaran Reddy
BRS
BJP

More Telugu News