YV Subba Reddy: ముగ్గురు కలిసి వచ్చినా, ఇద్దరు కలిసి వచ్చినా జగన్ పాలన ముందు నిలవలేరు: వైవీ సుబ్బారెడ్డి

YV SubbaReddy satire on tdp bjp jana sena alliance
  • పవన్ ఎప్పుడూ ముగ్గురం కలిసి వస్తామని అంటారని వైవీ వ్యాఖ్య  
  • ఎప్పుడూ ఒక్కరే కనిపిస్తున్నారని ఎద్దేవా 
  • ముగ్గురి పొత్తు గురించి బీజేపీ మాట్లాడాలన్న వైవీ 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పొత్తుల అంశంపై చురకలు అంటించారు. పవన్ ఎప్పుడూ ముగ్గురం కలిసి వస్తామని చెబుతున్నారని, కానీ ఆ ముగ్గురు ఎప్పుడూ ఒక్కసారి కలిసి కనబడలేదని ఎద్దేవా చేశారు. ఎక్కడ... ఎప్పుడు చూసినా ఒక్కొక్కరే కనిపిస్తున్నారన్నారు. అసలు ఈ ముగ్గురి పొత్తు గురించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాట్లాడాలని వ్యాఖ్యానించారు. అయినా ముగ్గురు కలిసి వచ్చినా... ఇద్దరు కలిసి వచ్చినా జగన్ పాలన ముందు ఎవరూ నిలవలేరన్నారు.

టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదటి నుండి భావిస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ను గద్దె దింపాలంటే ఈ మూడు పార్టీలు ఏకం కావాలని అంటున్నారు. పవన్ బీజేపీ, టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, టీడీపీ-బీజేపీ మధ్య మాత్రం పొసగడం లేదనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.
YV Subba Reddy
Pawan Kalyan
Janasena
YSRCP
BJP

More Telugu News