Prabhas: ఆదిపురుష్ తర్వాత తొలిసారి బయట కనిపించిన ప్రభాస్.. లుక్‌ అదుర్స్

Prabhas apperars first time since Adipurush release
  • ప్రాజెక్ట్ కె ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ వేడుక కోసం 
    అమెరికాలో ఉన్న రెబల్ స్టార్ 
  • బ్లూ జెర్సీలో మెరిసిపోతున్న ప్రభాస్
  • ఈ రోజు అమెరికాలో, రేపు భారత్‌లో ఫస్ట్ గ్లింప్స్ విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్-కె కోసం దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహానటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తారు. మొన్న హీరోయిన్ దీపికా పదుకొణే, నిన్న ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను రివీల్‌ చేసిన చిత్ర బృందం ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేసేందుకు సమాయత్తం అవుతోంది. హాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్ లో దీన్ని రీలీజ్ చేయనుంది. 

ఈ ఈవెంట్‌ కోసం చిత్ర యూనిట్ అంతా ఇప్పటికే అమెరికా వెళ్లింది. ప్రభాస్, కమలహాసన్, దగ్గుబాటి రానా ముగ్గురూ శాన్ డీగో కామిక్‌ కాన్‌కు చేరుకున్నారు. ఆదిపురుష్ విడుదల తర్వాత ఎవ్వరికీ కనిపించని ప్రభాస్.. బ్లూ కలర్ సూట్‌లో వచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ శాన్ డీగో కామిక్‌ కాన్‌ లో కమలహాసన్, రానా, దర్శకుడు నాగ్ అశ్విన్‌ మరికొందరితో మాట్లాడుతూ కనిపించాడు.
.
Prabhas
adipurush
ProjectK
Hollywood
USA

More Telugu News