Osmania University: వర్షాల ఎఫెక్ట్.. పరీక్షలు వాయిదా వేసిన ఓయూ

Osmania University All Exams Postponed Due to Heavy Rainfall in Telangana
  • గురు, శుక్ర వారాల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా
  • విద్యాసంస్థలకు సెలవుల నేపథ్యంలో వర్సిటీ నిర్ణయం
  • మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడి
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురు, శుక్ర వారాలు రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల గేట్లు తెరుచుకోవు. దీంతో గురు, శుక్ర వారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రకటించింది. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు.

వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ అధికారులు తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్‌ను త్వరలో ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
Osmania University
Exams Postponed
Rainfall
Telangana
holidays

More Telugu News