NDA Vs INDIA: NDA, INDIA రెండు కూటముల్లో చేరని 11 పార్టీలు ఇవే.. తటస్థంగా ఉన్న 91 మంది ఎంపీలు!

  • ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • ఎన్డీయేలో 39 పార్టీలు, ఇండియా కూటమిలో 26 పార్టీలు
  • తటస్థంగా ఉన్న వైసీపీ, బీఆర్ఎస్, టీడీపీ
11 parties not joined NDA or INDIA

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. మరోవైపు అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా (యూపీఏ కొత్త పేరు) కూటమిలలో సరికొత్త మిత్రుల కలయిక, కొత్త పొత్తులు కుదిరిన నేపథ్యంలో ఈ సమావేశాలు మరింత రంజుగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సమావేశాలు కొనసాగినన్ని రోజులు ప్రతిరోజు భేటీ కావాలని, తదుపరి కార్యాచరణను ఎప్పటికప్పుడు రూపొందించుకోవాలని విపక్ష కూటమి నిర్ణయించింది. 

ఇంకోవైపు ప్రస్తుతం ఉన్న ఎన్డీయే, ఇండియా కూటముల్లో 65 పార్టీలు ఉన్నాయి. ఎన్డీయేలో 39 పార్టీలు, ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. 11 పార్టీలు మాత్రం ఏ కూటమిలో లేకుండా తటస్థంగా ఉన్నాయి. వీటిలో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్, టీడీపీ, ఎంఐఎంలతో పాటు బిజూ జనతాదళ్, బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (ఎస్), ఏఐయూడీఎఫ్,  ఆర్ఎల్పీ, శిరోమణి అకాలీదళ్ (మాన్) ఉన్నాయి. ఈ పార్టీలకు 91 మంది ఎంపీల బలం ఉంది. 

More Telugu News