Nara Lokesh: లోకేశ్ పాదయాత్రను అనుసరించిన ఐప్యాక్ సభ్యులు.. ఒకరిని పట్టుకున్న కార్యకర్తలు

IPac Members Followed Lokesh Yuva Galam Padayatra One Held
  • లోకేశ్ పాదయాత్ర పెదఅలవలపాడుకు వెళ్తున్న సమయంలో ఘటన
  • అనుమానించి నిఘా పెట్టిన టీడీపీ కార్యకర్తలు
  • పారిపోయిన మిగతావారు
  • పాదయాత్రలో అల్లర్లు రేపేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారన్న టీడీపీ నేతలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్రలో ఐప్యాక్ సభ్యులు కనిపించడం కలకలం రేపింది. లోకేశ్ మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం గంగమ్మ దేవాలయం నుంచి పెదఅలవలపాడుకు వెళ్తున్న సమయంలో పాదయాత్రను ఐప్యాక్ సభ్యులు అనుసరించారు. వారు సంబంధం లేకుండా మాట్లాడుతుండడంతో అనుమానించిన యువగళం సభ్యులు నిఘా పెట్టి ఒకరిని పట్టుకున్నారు. గమనించిన మిగతా వారు పరారయ్యారు.

దొరికిన వ్యక్తిని ఎక్కడి నుంచి వచ్చావంటూ గట్టిగా ఆరా తీస్తే తనకేమీ తెలియదని, తనవాళ్లు చెప్పడంతో పాదయాత్రను అనుసరిస్తున్నానని చెప్పడంతో హెచ్చరించి వదిలిపెట్టారు. లోకేశ్ పాదయాత్రను ఐప్యాక్ సభ్యులు అనుసరించడంపై మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఐప్యాక్ సభ్యుల ద్వారా పాదయాత్రలో అల్లర్లు రేపేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
Nara Lokesh
Yuva Galam Padayatra
Telugudesam
I-Pac

More Telugu News