Ranbir Kapoor: ‘రామాయణం’ ఆధారంగా సినిమా.. సీతారాములుగా రణబీర్‌, ఆలియా?

Ranbir kapoor alia to star as Ram sita in another ramayan based movie
  • అల్లు అరవింద్, మధు మంతెన, సమిత్ మల్హోత్రా సమర్పణలో తెరకెక్కనున్న చిత్రం
  • తారల ఎంపిక, స్క్రీన్ టెస్టు పనుల్లో బిజీబిజీగా దర్శకుడు నితీశ్ తివారీ
  • సీతారాములుగా రణబీర్-ఆలియా, రావణుడిగా యశ్ నటించనున్నారని టాక్
రామాయణం ఆధారంగా మరో సినిమా త్వరలో తెరకెక్కనుందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి ఇది మూడేళ్ల నాటి విషయం. అప్పట్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఓ సినిమా నిర్మించనున్నట్టు ప్రకటన వచ్చింది. రామాయణం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని వెల్లడించారు. ఆ తరువాత ఈ మూవీపై కొత్త అప్‌డేట్స్ ఏవీ లేకపోవడంతో ఇది నిలిచిపోయిందని అంతా భావించారు. అయితే, ఈ వార్తలను కొట్టి పారేసిన నిర్మాతలు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తోందని పలుమార్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. 

తాజాగా ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దర్శకుడు నితీశ్ తివారీ సినిమా పనులను మరింత వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన పాత్రలైన రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు కోసం ఆర్టిస్టుల ఎంపిక, స్క్రీన్ టెస్ట్ నిర్వహించేందుకు నితీశ్ సన్నాహాల్లో ఉన్నారట. విశేషం ఏంటంటే, సీతారాములుగా రణబీర్, ఆలియా దంపతులు కనిపించబోతున్నారట. ఇక ‘కేజీఎఫ్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యశ్ రావణుడిగా నటిస్తారని తెలుస్తోంది.
Ranbir Kapoor
Alia Bhatt
Allu Aravind
Bollywood

More Telugu News