Etela Rajender: రాజాసింగ్‌ను కలవడంపై ఈటలకు అధిష్ఠానం మందలింపు?

  • కేసీఆర్ స్థాయిని మరిచి ఎగిసిపడితే ఇలాగే ఉంటుందని హెచ్చరిక
  • కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం
  • తెలంగాణను పాలించే సత్తాలేక జాతీయ రాజకీయాలంటూ ఊరేగుతున్నారని ఎద్దేవా
  • జాతీయస్థాయిలో ఏ కూటమిలో ఉన్నారో చెప్పాలని నిలదీత
  • రాజాసింగ్ ను కలవడం సరికాదని ఈటలకు అధిష్ఠానం హితవు
Etala Rajender asks KCR about national politics

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయంగా రోజులు దగ్గరపడ్డాయని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ బుధవారం నిప్పులు చెరిగారు. జాతీయస్థాయిలో కేసీఆర్ పరిస్థితి ఎటూ కాకుండా అయిపోయిందన్నారు. ఎవరి మద్దతు లేక కేసీఆర్ ఒంటరి అయ్యారని ఎద్దేవా చేశారు. స్థాయిని మరిచిపోయి ఎగిసిపడితే ఎప్పటికైనా ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. జాతీయస్థాయిలో కేసీఆర్ ఏ కూటమిలో ఉన్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణను పరిపాలించే సత్తా లేకే కేసీఆర్ జాతీయ రాజకీయాలు అని ఊరేగుతున్నారని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పారు.

ఈటలకు అధిష్ఠానం మందలింపు!

ఈటల రాజేందర్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలవడంపై అధిష్ఠానం ఈటలను మందలించినట్లుగా తెలుస్తోంది. సస్పెండ్ కు గురైన రాజాసింగ్ ను కలవడం సరికాదని హితవు పలికినట్లుగా తెలుస్తోంది. ఓ వర్గాన్ని కించపరిచారనే ఆరోపణల నేపథ్యంలో రాజాసింగ్ ను గత ఆగస్ట్ లో బీజేపీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఈటల, రాజాసింగ్ భేటీ చర్చనీయాంశంగా మారింది.

More Telugu News