Rahul Gandhi: తల్లి ఆక్సిజన్ మాస్క్‌తో ఉన్న విమానంలోని ఫొటోను షేర్ చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi shares pic of mother Sonia Gandhi during emergency landing
  • నిన్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో మాస్క్ ధరించిన సోనియా
  • విపత్కర పరిస్థితుల్లోనూ చలించని అమ్మ ఒత్తిడిలో ఉందంటూ క్యాప్షన్
  • ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫొటోకు గంటల్లోనే లక్షల లైక్స్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం తన తల్లి సోనియా గాంధీకి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో సోనియా తన ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉన్నారు. ఈ ఫొటోను రాహుల్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.  

మంగళవారం సాయంత్రం రాహుల్, సోనియా ప్రయాణిస్తున్న బెంగళూరు-ఢిల్లీ విమానం భోపాల్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమానంలో ఆక్సిజన్ తగ్గి, ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఆక్సిజన్ మాస్క్ ధరిస్తారు. ఆ సమయంలో ఈ ఫొటోను తీశారు. విపత్కర పరిస్థితుల్లోనూ చలించని అమ్మ ఒత్తిడిలో ఉందంటూ రాహుల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

రాహుల్ చేసిన ఈ పోస్ట్ కు కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ వచ్చాయి. ఇదిలాఉండగా, భోపాల్ విమానాశ్రయంలో రాహుల్, సోనియాలు ఉన్న విమానానిది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదని, ప్రాధాన్యతా ల్యాండింగ్ అని భోపాల్ విమానాశ్రయ డైరెక్టర్ రాంజీ అవస్తీ తెలిపారు. కాగా, మంగళవారం దాదాపు గంటన్నర సేపు ఎయిర్ పోర్టులో ఉన్న రాహుల్, సోనియా రాత్రి గం.9.35కు ఢిల్లీకి వెళ్లారు.
Rahul Gandhi
Sonia Gandhi
Congress
India

More Telugu News