Chinthamaneni Prabhakar: లోకేశ్ పాదయాత్రలో సర్ ప్రైజ్ ఇచ్చిన చింతమనేని

Chinthamaneni Prabhakar surprise in Nara Lokesh Yatra
  • క్యూలో నిలబడి లోకేశ్ ను సెల్ఫీ అడిగిన చింతమనేని
  • ఎప్పుడు వచ్చారన్నా అంటూ ఆత్మీయంగా పలకరించిన లోకేశ్
  • మీ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానన్న చింతమనేని
ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఉదయం సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ఊహించని విధంగా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని సర్ ప్రైజ్ చేశారు. టీడీపీ అభిమానులతో పాటు క్యూలో నిలబడి లోకేశ్ ను సెల్ఫీ అడిగారు. చింతమనేనిని చూసి ఆశ్చర్యపోయిన లోకేశ్... అన్నా మీరెప్పుడు వచ్చారంటూ ఆత్మీయంగా పలకరించారు. మీ యాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చానని చెప్పిన చింతమనేని... లోకేశ్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. మరో విషయం ఏమిటంటే లోకేశ్ ను కలవడానికి 700 మంది నేతలు, కార్యకర్తలతో కలిసి చింతమనేని వచ్చారు.
Chinthamaneni Prabhakar
Nara Lokesh
Yuva Galam Padayatra
Telugudesam

More Telugu News