Junior NTR: రామ్ చరణ్, ఉపాసనలకు సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR sends special gift to Ram Charan and Upasana
  • క్లీంకార కోసం గోల్డ్ డాలర్స్ ను పంపిన తారక్
  • డాలర్స్ పై చరణ్, ఉపాసన, క్లీంకార పేర్లు వచ్చేలా ప్రత్యేక డిజైన్
  • ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్న తారక్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్యే కాకుండా వారిరువురి కుటుంబాల మధ్య కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో వీరి అనుబంధం మరింత పెరిగింది. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. చిన్నారికి క్లీంకార అనే పేరు పెట్టారు. మరోవైపు క్లీంకార కోసం చరణ్, ఉపాసనలకు జూనియర్ ఎన్టీఆర్ ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించాడట. గోల్డ్ డాలర్స్ ను బహుమతిగా పంపాడట. ఆ డాలర్స్ పై చరణ్, ఉపాసన, క్లీంకార పేర్లు వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడట. ఇక సినిమాల విషయానికి వస్తే తారక్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా చేస్తుండగా... శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రంలో చరణ్ నటిస్తున్నాడు.
Junior NTR
Ramcharan
Gift
Tollywood

More Telugu News