Satwik Siraj Rankireddy: గంటకు 565 కి.మీ వేగంతో స్మాష్... గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు షట్లర్ సాత్విక్ సాయిరాజ్

  • పురుషుల బ్యాడ్మింటన్ లో చరిత్ర సృష్టించిన సాత్విక్
  • ఇండోనేషియా ఓపెన్ లో ఆడుతూ తుపాను వేగంతో స్మాష్ కొట్టిన వైనం
  • మలేషియా ఆటగాడి పేరిట ఉన్న రికార్డు బద్దలు
Satwik Sairaj hits a smash with 565 km speed and set new Guinness Book Record

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. పురుషుల బ్యాడ్మింటన్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ కొట్టనంత వేగంగా స్మాష్ కొట్టిన సాత్విక్ సాయిరాజ్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. 

ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో డబుల్స్ విభాగంలో ఆడుతున్న సాయిరాజ్ కొట్టిన ఓ స్మాష్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. బ్యాడ్మింటన్ హిస్టరీలో ఇప్పటివరకు ఇంత బలంగా ఎవరూ స్మాష్ కొట్టలేదు. 

గతంలో ఈ రికార్డు మలేషియాకు చెందిన టాన్ బూన్ హియాంగ్ పేరిట ఉంది. హియాంగ్ 2013 మేలో గంటకు 493 కిలోమీటర్ల వేగంతో స్మాష్ ను సంధించాడు. ఇప్పుడా రికార్డును సాత్విక్ సాయిరాజ్ బద్దలు కొట్టాడు. సాత్విక్ కొట్టిన షాట్ వేగం ఓ ఫార్ములా వన్ రేస్ కారు వేగం కంటే ఎక్కువ. 

మరోవైపు, మహిళల విభాగంలో మలేషియాకు చెందిన టాన్ పియర్లీ పేరిట వేగవంతమైన స్మాష్ రికార్డు నమోదైంది. పియర్లీ గంటకు 438 కి.మీ వేగంతో స్మాష్ ను కొట్టింది.

More Telugu News