Tulasi Reddy: వైసీపీ, టీడీపీ రెండూ కీలుబొమ్మలే: తులసిరెడ్డి

Tulasi Reddy comments on TDP and YSRCP
  • వైసీపీ, టీడీపీ దొందూ దొందేనన్న తులసిరెడ్డి
  • ప్రత్యేక హోదాను సాధించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని విమర్శ
  • విభజన చట్టంలోని అంశాల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమని వ్యాఖ్య

వైసీపీ, టీడీపీ దొందూ దొందేనని ఏపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. బీజేపీ చేతిలో ఈ రెండు పార్టీలు కీలుబొమ్మలేనని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. బుందేల్ ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీని రాయలసీమకు, ఉత్తరాంధ్రకు సాధించడంలో విఫలమయ్యాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, విజయవాడ మెట్రో, విశాఖ మెట్రో, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు వంటి అంశాల్లో కూడా విఫలమయ్యాయని చెప్పారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే విధంగా వ్యవహరిస్తుండటం బాధాకరమని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. 

  • Loading...

More Telugu News