Pawan Kalyan: టీడీపీ, బీజేపీలతో పొత్తుపై ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

TDP Janasena and BJP may contest unitedly says Pawan Kalyan
  • టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్న పవన్
  • సీఎం ఎవరనేది ఫలితాలను బట్టి నిర్ణయిస్తామని వ్యాఖ్య
  • వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని స్పష్టీకరణ
ఎన్డీయే సమావేశానికి హాజరవడానికి జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. హస్తినలో ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయిస్తామని చెప్పారు. సీఎం ఎవరు కావాలనేది ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. తమకు అండగా ఉండే వారినే ప్రజలు కోరుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని... వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అందరం కలిసి పోరాడాలని చెప్పారు. 

పవన్ తాజా వ్యాఖ్యలతో ఏపీలో పొత్తులపై చాలా వరకు క్లారిటీ వచ్చినట్టయింది. టీడీపీతో కలిసి పోటీ చేస్తామనే విషయాన్ని ఇప్పటి వరకు పవన్ ప్రకటించని సంగతి తెలిసిందే. అయితే, ఢిల్లీ వేదికగా పొత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోయే పరిస్థితి ఉంది. మూడు పార్టీలు కలిసి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Pawan Kalyan
Janasena
Telugudesam
BJP
Alliance
Delhi

More Telugu News