Ponguleti Srinivas Reddy: తెలంగాణ హైకోర్టులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వల్ప ఊరట

Ponguleti Srinivas Reddy gets small relief in TS High Court
  • తమ భూముల్లో ప్రభుత్వ సర్వేపై హైకోర్టును ఆశ్రయించిన పొంగులేటి
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
  • సర్వేపై స్టేటస్ కో ఆర్డర్ జారీ
తమ భూములపై ప్రభుత్వం చేస్తున్న సర్వేను సవాల్ చేస్తూ టీకాంగ్రెస్ ప్రచార కమిటీ కోఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పొంగులేటి పిటిషన్ ను ఈరోజు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వేపై స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. సర్వే చేసి రిపోర్టును హైకోర్టుకు సమర్పించాలని... అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్ట్ 1కి వాయిదా వేసింది. దీంతో పొంగులేటికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించినట్టయింది.
Ponguleti Srinivas Reddy
Congress
TS High Court

More Telugu News