Project K car rally: అమెరికాలో మొదలైన ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' సందడి.. భారీ కార్ల ర్యాలీ.. వీడియో ఇదిగో

  • కార్ల ర్యాలీ నిర్వహించిన సెయింట్ లూయిస్, మిస్సోరి రాష్ట్రాల అభిమానులు
  • ఈ నెల 20న విడుదల కానున్న సినిమా గ్లింప్స్
  • ఇప్పటికే సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు
Prabhas Project K Car Rally in USA

ప్రభాస్ తాజా చిత్రం 'ప్రాజెక్ట్ కే' సందడి అప్పుడే మొదలయింది. అమెరికాలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ భారీ కార్ల ర్యాలీతో సందడి చేశారు. ఈ నెల 20న అమెరికాలోని శాన్ డియాగోలో 'ప్రాజెక్ట్ కే' టైటిల్ తో పాటు, గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, యూఎస్ లోని సెయింట్ లూయిస్, మిస్సోరి రాష్ట్రాలకు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ ఒక చోటుకు చేరి కార్ల ర్యాలీ నిర్వహించారు. 

ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ. వెయ్యి కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో దీపిక ఫస్ట్ లుక్ ను నిన్న రాత్రి మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి దిగ్గజాలు నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.

More Telugu News