లిక్కర్ స్కామ్ కేసు.. మాగుంట రాఘవకు బెయిల్
- అనారోగ్య కారణాలతో 4 వారాలు మంజూరు చేసిన కోర్టు
- ఈడీ అధికారుల విచారణకు సహకరించాలని షరతు
- వారంలో రెండు రోజులు ఈడీ ఎదుట రిపోర్ట్ చేయాలని ఆదేశం
కేసు విచారణలో అధికారులకు సహకరించాలని, ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని హైకోర్టు తెలిపింది. చెన్నై సిటీకే పరిమితం కావాలని, పాస్ పోర్ట్ ను కోర్టుకు సరెండర్ చేయాలని, దేశం దాటి వెళ్లొద్దని ఆదేశించింది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని పేర్కొంది.