Australia: ఆస్ట్రేలియా సముద్ర తీరంలో 'చంద్రయాన్-3'కి చెందిన వస్తువు?

  • గ్రీన్ హెడ్ పట్టణ తీరంలో కనిపించిన వింత వస్తువు
  • రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న వస్తువును చూసి స్థానికుల ఆశ్చర్యం
  • చంద్రయాన్-3  నుంచి విడివడిన వస్తువు అయ్యుండొచ్చని నెట్టింట టాక్
  • మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన సంస్థ
Twitter abuzz over mystery object on Australian beach

ఆస్ట్రేలియా సముద్ర తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు కనిపించడం కలకలానికి దారితీసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ పట్టణ తీరంలో ఇది కనిపించింది. రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న ఆ వస్తువు ఏంటో అర్థంకాక స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇటీవల చంద్రయాన్-3 ఆస్ట్రేలియా గగనతలంలో ప్రయాణించిన నేపథ్యంలో ఆ రాకెట్ నుంచి విడివడి కింద పడ్డ శకలం అయి ఉంటుందన్న చర్చ నెట్టింట నడుస్తోంది. ఈ వస్తువుకు దూరంగా ఉండాలంటూ స్థానికులను అక్కడి అధికారులు హెచ్చరించారు. 

ఈ వస్తువు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? అన్న విషయాలు తేల్చేందుకు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ కూడా రంగంలోకి దిగింది. విదేశీ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినది అయి ఉండొచ్చని అంచనా వేస్తోంది. అంతేకాకుండా, పలు దేశాలతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా, ఈ వస్తువు భారత్‌కు చెందిన పీఎస్ఎల్‌వీ రాకెట్‌కు సంబంధించినది అని తాను అనుకుంటుంన్నట్టు అంతరిక్ష నిపుణురాలు డా. ఏలిన్ గార్మన్ తెలిపారు.

More Telugu News