తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు చంద్రబాబు ఫోన్
- సోషల్ మీడియాలో అనితపై అసభ్య పోస్టులు!
- ధైర్యంగా ఉండాలన్న చంద్రబాబు
- పార్టీ అండగా నిలుస్తుందని... వైసీపీపై పోరాటం కొనసాగించాలని సూచన
కాగా, గత కొన్నిరోజులుగా తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు పోస్టులు పెట్టేవారికి చెప్పులతోనే బదులిస్తామని హెచ్చరించవారు. తెలుగు మహిళ విభాగం నేడు అనిత ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద కొబ్బరికాయలు కొట్టారు. మహిళలను కాపాడాలంటూ కనకదుర్గ అమ్మవారిని ప్రార్థించారు. ఈ క్రమంలో మహిళల జోలికి వస్తే వదిలేది లేదని చెప్పులు చూపిస్తూ ర్యాలీ చేపట్టారు.
వైసీపీ సోషల్ మీడియా విభాగం సజ్జల భార్గవ్ రెడ్డి చేతుల్లోకి వెళ్లాక మితిమీరిపోయిందని అనిత మండిపడ్డారు.