Air India: ఎయిరిండియా విమానంలో ఫోన్ చార్జర్ కలకలం

Air India plane returns to terminal due to a problematic phone charger
  • ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో ఘటన
  • ఢిల్లీ వెళ్లేందుకు రన్ వే పైకి చేరుకున్న విమానం
  • ఫోన్ చార్జర్ కారణంగా తిరిగి టెర్మినల్ వద్దకు విమానం తరలింపు
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో ఫోన్ చార్జర్ కారణంగా ఓ విమానం టేకాఫ్ నిలిచిపోయింది. ఉదయ్ పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం టెర్మినల్ నుంచి రన్ వే మీదకు వెళుతుండగా, విమానంలో ఫోన్ చార్జర్ కలకలం రేగింది. 

ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న ఫోన్ చార్జర్ నుంచి సమస్య ఉత్పన్నం కావడంతో ఆ విమానాన్ని రన్ వే పైనుంచి తిరిగి టెర్మినల్ వద్దకు తరలించారు. అయితే, ఫోన్ చార్జర్ లో ఎలాంటి సమస్య ఏర్పడిందన్నది తెలియరాలేదు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే బ్యాటరీల కారణంగా విమానాల్లో అగ్నిప్రమాదాలు జరిగిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఈ కారణంగానే, ఉదయ్ పూర్-ఢిల్లీ విమానం టేకాఫ్ ను నిలిపివేసి ఉంటారని భావిస్తున్నారు. 

ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతాంశమని, ప్రయాణికుడి నుంచి చార్జర్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత విమానం 40 నిమిషాల ఆలస్యంగా బయల్దేరిందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.
Air India
Phone Charger
Udaipur
New Delhi

More Telugu News