Amitabh Bachchan: అమిత్ షా చూస్తుండగా రూ. 2,300 కోట్ల డ్రగ్స్ ధ్వంసం

Rs 2300 cr drugs destroyed as amit Shah watching virtually
  • దేశ వ్యాప్తంగా 1,44,000 కేజీల మాదకద్రవ్యాలను ధ్వంసం చేసిన ఎన్సీబీ
  • హైదరాబాద్ యూనిట్ లో 6,590 కేజీల మాదకద్రవ్యాలు
  • ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా వీక్షించిన అమిత్ షా
దేశ వ్యాప్తంగా ఈరోజు రూ. 2,300 కోట్ల విలువైన డ్రగ్స్ ను ధ్వంసం చేశారు. అన్ని రాష్ట్రాల్లోని యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్సులను సమన్వయం చేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాదకద్రవ్యాలను ధ్వంసం చేసింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ గా వీక్షించారు. 'డ్రగ్స్ అక్రమ రవాణా.. జాతీయ భద్రత' పేరుతో ఈరోజు కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎక్సర్ సైజ్ లో భాగంగా 1,44,000 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. 

ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రతినిధి మాట్లాడుతూ... ఎన్సీబీ హైదరాబాద్ యూనిట్ 6,590 కేజీల డ్రగ్స్ ను సీజ్ చేసిందని ఇండోర్ యూనిట్ లో 822 కేజీలు, జమ్మూకశ్మీర్ యూనిట్ లో 4,069, గుజరాత్ యూనిట్ లో 2,458, హర్యానా యూనిట్ లో 4,069 కేజీలు ధ్వంసం చేసినట్టు తెలిపారు. మధ్య ప్రదేశ్ లో అత్యధికంగా 1,03,884 కేజీలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. 

Amitabh Bachchan
BJP
Drugs

More Telugu News