Pawan Kalyan: ఇలా కూడా శాలువా కప్పుతారా... పవన్ తిరుపతి ర్యాలీలో విచిత్ర దృశ్యం!

Pawan Kalyan has been surprised by a fan in Tirupati rally
  • సీఐ అంజూ యాదవ్ పై పవన్ కల్యాణ్ ఫిర్యాదు
  • తిరుపతిలో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ
  • క్రేన్ కు వేళ్లాడుతూ వచ్చి జనసేనానికి శాలువా కప్పిన అభిమాని
  • విస్మయానికి గురైన పవన్ కల్యాణ్
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో
జనసేన నేత కొట్టే సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై ఫిర్యాదు చేసేందుకు పవన్ కల్యాణ్ ఇవాళ తిరుపతి వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా తిరుపతి ఎస్పీ ఆఫీసుకు చేరుకున్నారు. 

కాగా, ఈ ర్యాలీలో ఓ విచిత్ర దృశ్యం చోటుచేసుకుంది. ఇలా కూడా శాలువా కప్పుతారా అని ఆశ్చర్యపరిచే రీతిలో... ఓ అభిమాని క్రేన్ కు వేళ్లాడుతూ వచ్చి కారులో నిలుచుని ఉన్న పవన్ కు శాలువా కప్పి, పూల దండ వేసి సత్కరించాడు. 

అభిమాని సాహసం చూసిన పవన్ కూడా విస్మయానికి గురయ్యారు. అదే సమయంలో, ఆ అభిమాని వేళ్లాడిన తీరుకు ఆయన నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Pawan Kalyan
Fan
Crane
Tirupati
CI Anju Yadav
Janasena

More Telugu News