ISRO: విమానం నుంచి చంద్రయాన్-3 ప్రయోగం రికార్డింగ్.. నెట్టింట వీడియో వైరల్

  • నింగిలోకి దూసుకుపోతున్న చంద్రయాన్-3ని విమానం నుంచి రికార్డింగ్
  • అస్త్రంలా దూసుకుపోయిన చంద్రయాన్
  • నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న వీడియో
Chandrayaan 3 Lift Off Recorded From Plane Window Spectacular Video Goes Viral

చంద్రయాన్-3 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగసిన క్షణాన ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగింది. ఆ దృశ్యాల్ని ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తమ ప్రొఫైల్స్‌లో డీపీగా పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇస్రో రాకెట్ నింగిలోకి దూసుకెళుతుండగా విమానంలోంచి ఓ ప్రయాణికుడు రికార్డ్ చేశాడు. బ్రహ్మాస్త్రం తన లక్ష్యం దిశగా దూసుకుపోతున్నట్టు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇస్రో మెటీరియల్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న డా. పీవీ వెంకటకృష్ణనన్ ఈ వీడియోను షేర్ చేశారు. చంద్రయాన్-3 ప్రయాణాన్ని వీక్షించాలంటూ ఆ విమానంలోని పైలట్ స్వయంగా ప్రయాణికులకు చెప్పినట్టు ఆయన తెలిపారు. 


More Telugu News