Smriti Irani: మోదీ మౌనంపై రాహుల్ ప్రశ్న.. స్మృతి ఇరానీ సమాధానం

Smriti Irani answer to Rahul gandhi question to Modi
  • మణిపూర్ హింసపై మోదీ మౌనంగా ఉన్నారన్న రాహుల్ గాంధీ
  • రాఫెల్ విమానాల కోసం ఫ్రాన్స్ కు వెళ్లారని విమర్శ
  • దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని రాహుల్ కోరుకుంటున్నారని స్మృతి మండిపాటు
మణిపూర్ లో చోటు చేసుకుంటున్న హింసపై యూరోపియన్ పార్లమెంటులో కూడా మాట్లాడుకుంటున్నారని... మన ప్రధాని మోదీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపూర్ గురించి మాట్లాడని ప్రధాని రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ పరేడ్ కు మాత్రం వెళ్లారని ఎద్దేవా చేశారు. 

రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ జోక్యాన్ని కోరుకుంటున్న వ్యక్తి రాహుల్ అని విమర్శించారు. దేశ రక్షణ విషయాలను డిఫెన్స్ కాంట్రాక్టులుగా చూస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు.
Smriti Irani
Narendra Modi
BJP
Rahul Gandhi
Congress

More Telugu News