Nara Lokesh: రేపు కందుకూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర

  • లోకేశ్ పాదయాత్రకు రెండ్రోజుల విరామం
  • కోర్టు పనిమీద మంగళగిరి వచ్చిన లోకేశ్
  • రేపు కొండాపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర పునఃప్రారంభం
  • లోకేశ్ కు స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న కందుకూరు శ్రేణులు
Nara Lokesh Yuvagalam will enter Kandukur tomorrow

రెండ్రోజుల విరామం అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. ఇటీవల లోకేశ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజవర్గంలో పాదయాత్ర చేస్తూ, కోర్టు పనిమీద మంగళగిరి వచ్చారు. జులై 13, 14 తేదీల్లో ఆయన మంగళగిరిలో బిజీగా గడిపారు. రేపు (జులై 15) మళ్లీ పాదయాత్రకు పునరంకితం కానున్నారు. 

రేపు ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం క్యాంప్ సైట్ నుంచి లోకేశ్ పాదయాత్ర షురూ కానుంది. వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాత్రికి  నెల్లూరు జిల్లా సరిహద్దు కందుకూరు నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. లోకేశ్ కు స్వాగతం పలికేందుకు కందుకూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.

యువగళం పాదయాత్ర వివరాలు

ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం – 2039.4 కి.మీ.
155వరోజు యువగళం పాదయాత్ర వివరాలు:
ఉదయగిరి/కందుకూరు (ఉమ్మడి ప్రకాశం జిల్లా) నియోకవర్గాలు

సాయంత్రం

4.00 – కొండాపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.15 – మర్రిగుంట క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
5.15 – రెనమాలలో ముస్లింలతో సమావేశం.
6.45 – నేకునంపేట తూర్పుపాలెంలో స్థానికులతో సమావేశం.
7.00 – కొత్తపటలో స్థానికులతో మాటామంతీ.
7.10 – ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
8.10 – పెంట్రాల తాతా హోటల్ సెంటర్ లో స్థానికులతో సమావేశం.
8.35 – జంపాలవారిపాలెంలో  రైతులతో సమావేశం.
8.45 – వాకమల్లోరిపాలెంలో స్థానికులతో మాటామంతీ.
9.15 – లింగసముద్రంలో స్థానికులతో సమావేశం.
9.35 – తిరుమలశెట్టి కోటయ్య సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
9.45 – లింగసముద్రం ఎస్సీ కాలనీలో దళితులతో సమావేశం.
9.50 – లింగసముద్రం బలిజపాలెంలో బలిజలతో సమావేశం.
10.05- రామకృష్ణాపురంలో స్థానికులతో మాటామంతీ.
11.05 – వెంగళాపురంలో స్థానికులతో మాటామంతీ.
11.35 – వెంగళాపురం శివారు విడిది కేంద్రంలో బస.

More Telugu News