రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించింది చంద్రబాబే.. ఎందుకంటే..!: పోచారం
- కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేందుకే తన ఏజెంట్ రేవంత్ ను పంపించారని ఆరోపణ
- బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం కాదన్న పోచారం
- రేవంత్ సీఎం ఆశలు కల్లలే అవుతాయని మండిపాటు
రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుండి సీఎం కావాలని కలలు కంటున్నాడని, ఆ ఆశలు కల్లలుగానే మిగలడం ఖాయమన్నారు. హైదరాబాద్ చుట్టూ భూకబ్జాలు చేయడం, దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం, డబ్బులు ఇవ్వని వారిపై దాడులు చేయడం రేవంత్ నైజం అన్నారు. ఈసారి కాంగ్రెస్ కు గతంలో కంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోన్న ఏకైక సీఎం కేసీఆరే అన్నారు. బీఆర్ఎస్ గెలుపును మూడోసారి ఎవరూ ఆపలేరని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారన్నారు. సర్వేలన్నీ కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నట్లు పోచారం చెప్పారు.