Ambati Rambabu: పవన్ నీతిమంతుడైతే ఏ సినిమాకు ఎంత తీసుకున్నాడో చెప్పాలి: అంబటి రాంబాబు

Ambati Rambabu question to Pawan Kalyan about his remunaration
  • పవన్ గోదావరి జిల్లాల్లోనే ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్న
  • కాపులను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లాలని చూస్తున్నాడని ఆగ్రహం
  • పిట్టకూతలు కూసే పవన్ రాజకీయాలకు సరిపోడని ఎద్దేవా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం గోదావరి జిల్లాల్లోనే ఎందుకు తిరుగుతున్నారని అంబటి రాంబాబు శుక్రవారం ప్రశ్నించారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... కాపులను టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లోని కాపులు అంతా టీడీపీపై కక్షతో ఉన్నారన్నారు. అలాంటి టీడీపీ వద్దకు కాపులను దగ్గర చేయాలని పవన్ చూస్తున్నారని దుయ్యబట్టారు.

పిట్టకూతలు కూసే పవన్ కల్యాణ్ రాజకీయాలకు ఏమాత్రం సరిపోడని ఎద్దేవా చేశారు. పవన్ నీతిమంతుడైతే ఏ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. పవన్ తన జీవితం మొత్తంలో కూడా అసెంబ్లీకి వెళ్లడన్నారు. పవన్ కామెడీని చూసి జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నారు.
Ambati Rambabu
Pawan Kalyan
Janasena
YSRCP
Chandrababu

More Telugu News