Atchannaidu: 160 రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు: అచ్చెన్నాయుడు

Atchannaidu says Chandrababu Naidu will become CM after 160 days
  • మహాశక్తి ప్రచార కార్యక్రమంలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
  • యాభై రోజుల పాటు మహాశక్తి పథకాలపై ప్రచార కార్యక్రమాలు
  • జగన్ బటన్ నొక్కినా ఖాతాల్లో డబ్బులు పడటం లేదని విమర్శ
మరో 160 రోజుల్లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. యాభై రోజుల పాటు మహాశక్తి పథకాలపై పార్టీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ బటన్ నొక్కినా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడటం లేదన్నారు. ఆయన ఫేక్ ముఖ్యమంత్రి అని, అబద్ధాల కోరు అని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాశక్తి ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మద్యనిషేధం చేస్తానని చెప్పిన జగన్ మాట మార్చారని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.
Atchannaidu
Telugudesam
Chandrababu

More Telugu News