Swarnalatha: విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారం.. మీడియా కంట పడకుండా స్వర్ణలత తరలింపు

Visakha Note Exchange Case Suspended CI Swarnalatha Questioned
  • విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారంలో సస్పెండైన రిజర్వు సీఐ సర్ణలత  
  • కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు
  • అధికారుల ప్రశ్నలకు పెదవి విప్పని స్వర్ణలత
  • మరోమారు ప్రశ్నించే అవకాశం
సంచలనం సృష్టించిన విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారంలో సస్పెండ్ అయిన రిజర్వు సీఐ స్వర్ణలతను పోలీసులు నిన్న కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంగార్డు, రిజర్వు కానిస్టేబుల్‌ను కూడా కస్టడీకి తీసుకుని విచారించారు. ఇదొక్కటేనా? లేదంటే గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా? అన్న వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఆమె నటిస్తున్నట్టుగా చెబుతున్న సినిమా గురించి కూడా ఆరా తీశారు. 

విచారణకు ఆమె సహకరించలేదని సమాధానం. అధికారుల ప్రశ్నలకు ఆమె మౌనంగా ఉండిపోయారని తెలుస్తోంది. దీంతో ఆమెను మరోమారు కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. అనంతరం కేజీహెచ్‌లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మీడియా కంట పడకుండా మరో మార్గంలో ఆమెను జడ్జికి ఇంటికి తరలించారు.
Swarnalatha
Currency Exchange
Visakhapatnam

More Telugu News