Daggubati Purandeswari: ఏపీ బీజేపీలో ఎలాంటి వర్గాలు లేవు: పురందేశ్వరి

There are no groups in AP BJP says Purandeswari
  • ఇంద్రకీలాద్రి దుర్గామాతను దర్శించుకున్న పురందేశ్వరి దంపతులు
  • రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్న పురందేశ్వరి
  • పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సహకారం తీసుకుంటానని వ్యాఖ్య
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆమె భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ ఉదయం బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గామాతను దర్శించుకున్నారు. అమ్మవారికి పురందేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. దర్శనానంతరం మీడియాతో ఆమె కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆమె తెలిపారు. రాష్ట్ర బీజేపీలో ఎలాంటి వర్గాలు లేవని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి కార్యకర్త సహకారాన్ని తీసుకుంటానని తెలిపారు. 

ఈ నెల 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ హైకమాండ్ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది.
Daggubati Purandeswari
BJP

More Telugu News