Jagan: నీవు మేమంతా గర్వపడేలా చేశావు జ్యోతి: జగన్

  • ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్ల హర్డిల్స్ లో విజేతగా నిలిచిన జ్యోతి
  • ఫైనల్ రేసును 13.9 సెకన్లలో పూర్తి చేసిన వైజాగ్ అమ్మాయి
  • అభినందనలు తెలియజేసిన సీఎం జగన్
CM Jagan congratulates athlete Jyothi

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో వైజాగ్ అమ్మాయి జ్యోతి యర్రాజి స్వర్ణ పతకం సాధించింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన ఆమె పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి ఛాంపియన్ గా అవతరించింది. 100 మీటర్ల హర్డిల్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ అథ్లెట్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 

ఛాంపియన్ గా నిలిచిన జ్యోతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రశంసలు కురిపించారు. 'థాయ్ లాండ్ లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జ్యోతికి అభినందనలు. నీవు మేమంతా గర్వపడేలా చేశావు' అని జగన్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపడుతున్న ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా బెస్ట్ విషెస్ చెప్పారు.

More Telugu News